Pawan Kalyan: జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తాం 4 d ago
ప్రతి ఒక్కరికి నీటి సరఫరా అందించాలి ఇదే జల్ జీవన్ మిషన్ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ లో ఆయన మాట్లాడారు. ప్రతి మనిషికి రోజు 55 లీటర్ల మంచినీరు ఇవ్వాలని ప్రధాని కల అని అన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న నీటి వనరులు, ప్రాజెక్టులను పరిరక్షించుకోవాలని సూచించారు. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం రూ. 4వేల కోట్లు దుర్వినియోగం చేసిందని పవన్ కల్యాణ్ విమర్శించారు. నీటిని ఎక్కడి నుంచి తెచ్చుకుంటామనేది గుర్తించక ముందే పైపులు వేశారన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ. 70 వేల కోట్లు మంజూరు చేయాలని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ను కోరామన్నారు. పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు. జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకొని జలశక్తి మంత్రికి పంపిస్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్ ను మరింత బలోపేతం చేస్తామని పేర్కొన్నారు. అనేకమంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారాన్ని తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలని, నిరంతరం ప్రతి ఒక్కరికీ నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైంది" అని పవన్ అన్నారు.